Hyderabad: లోటస్‌పాండ్‌ వద్ద ఆటో డ్రైవర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

Auto driver Shadif commits suicide at Lotus Pond Hyderabad
   
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ వద్ద ఆటో డ్రైవర్‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేసి, చెట్టుకు ఉరేసుకోవ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పరిశీలించారు. మృతుడిని టోలీచౌకికి చెందిన షాదిఫ్‌(28)గా గుర్తించారు. 

అనంత‌రం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుప‌త్రికి తరలించారు. కాగా, ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు ఆర్థిక ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.  
Hyderabad
Shadif
Auto driver suicide
Hyderabad auto driver
Lotus Pond
Toli Chowki
Financial problems
Suicide case
Osmania Hospital

More Telugu News