Manoj Manchu: మనోజ్.. నీవు నాకు కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ: సాయి దుర్గా తేజ్

- నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్ నటించిన 'భైరవం'
- నీవు మళ్లీ తెరపైకి వస్తున్నందుకు సంతోషంగా ఉందన్న సాయి తేజ్
- నీ నటనకు పెద్ద అభిమానిని అని వ్యాఖ్య
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన 'భైరవం' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో మనోజ్ కు హీరో సాయి దుర్గా తేజ్ అభినందనలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. నిన్ను స్క్రీన్ మీద చూసేందుకు ఎదురు చూస్తున్నానని సాయి తేజ్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో ఇన్ని రోజులు నీవు స్క్రీన్ కి దూరమయినందుకు నాకు చాలా కోపంగా ఉందని చెప్పాడు. ఇప్పుడు నీవు మళ్లీ తెరమీదకు వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. నీవు నాకు కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ... నీ కమ్ బ్యాక్ ఎంతో స్ట్రాంగ్ గా ఉండాలని ఆకాంక్షించాడు. నీ నటనకు నేను పెద్ద అభిమానిని... నీ ఎనర్జీని మరోసారి చూడాలని ఉందని చెప్పాడు.