YS Avinash Reddy: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసం.. ఎంపీ పీఏ సహా 15 మంది వైసీపీ నేతలపై కేసు

YS Avinash Reddy PA Named in TDP Flex Vandalism Case in Pulivendula
  • మహానాడు సందర్భంగా పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల ఏర్పాటు
  • ప్రధాన నిందితుడిగా ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి 
  • నిందితుల జాబితాలో పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ కూడా
మహానాడు సందర్భంగా కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డిని ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చగా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌ను ఐదో నిందితుడిగా (ఏ5) పేర్కొన్నారు.

మహానాడు నేపథ్యంలో పులివెందులలోనూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసి, ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనలో వైసీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా, ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వంటి కీలక నేతల పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ ఘటనతో పులివెందులలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  
YS Avinash Reddy
Pulivendula
TDP
YSRCP
Raghavareddy
Varaprasad
Andhra Pradesh Politics
Flex Banners
Political Clash
Kadapa

More Telugu News