Mahesh Babu: తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్: స్పందించిన మహేశ్ బాబు, సుకుమార్

- గద్దర్ తెలంగాణ ఫిల్మ్స్ అవార్డులపై ప్రముఖుల స్పందన
- ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ బాబు
- ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘మేజర్’ చిత్రాలకు అవార్డులు రావడంపై ఆనందం
- బీఎన్ రెడ్డి పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న సుకుమార్
- జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన సుకుమార్
తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్స్ అవార్డుల పట్ల టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మహేశ్ బాబు స్పందిస్తూ, "శ్రీమంతుడు, మహర్షి, మేజర్ వంటి చిత్రాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించి, సినీ పండుగలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాల విజయానికి కారకులైన నా దర్శకులకు మరింత ప్రేమను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా ఈ అవార్డుల పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. "ప్రతిష్ఠాత్మకంగా భావించే గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో భాగంగా నాకు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా ఉంది. ఇంత గొప్ప అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక శిఖరంలాంటి వ్యక్తి బీఎన్ రెడ్డి గారి పేరు మీద నెలకొల్పిన అవార్డును అందుకోవడం మరింత గర్వకారణం. నా చిత్రాల్లో భాగస్వాములైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అలాగే నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని సుకుమార్ అన్నారు.