Jasprit Bumrah: తాను ఎందుకు అత్యుత్త‌మ‌మో బుమ్రా మ‌రోసారి నిరూపించుకున్నాడు.. డివిలియ‌ర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

De Villiers Praises Jasprit Bumrahs Impact in MI vs GT IPL Match
  • ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన గుజ‌రాత్‌
  • ఉత్కంఠ పోరులో ముంబ‌యి గెలుపు
  • అద్భుత‌మైన‌ యార్క్‌ర్‌తో సుంద‌ర్‌ను బోల్తా కొట్టించిన బుమ్రా
  • ఈ వికెట్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన స్టార్ పేస‌ర్‌
  • ఈ విష‌యమై ద‌క్షిణాఫ్రికా మాజీ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
నిన్న‌ ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)పై ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ 228 ప‌రుగులు చేసింది. జీటీకి 229 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, కొండంత ల‌క్ష్య‌ఛేద‌న‌లో గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 208 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో ముంబ‌యి 20 ప‌రుగుల తేడాతో గెలిచింది.

ఈ ప‌రాజ‌యంతో గుజ‌రాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఇక‌, ఈ గెలుపుతో రేపు (ఆదివారం) అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగే క్వాలిఫ‌య‌ర్‌-2కి ముంబ‌యి అర్హ‌త సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో ఎంఐ త‌ల‌ప‌డ‌నుంది. కాగా, నిన్న‌టి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ముంబ‌యి స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పిన సంగ‌తి తెలిసిందే. 

అద్భుత‌మైన యార్క్‌తో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న వాషింగ్ట‌న్‌ సుంద‌ర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. జీటీ 13.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లకు 151 ర‌న్స్‌తో ప‌టిష్ట స్థితిలో ఉన్న స‌మ‌యంలో సుంద‌ర్‌(48)ను బుమ్రా పెవిలియ‌న్‌కి పంపి కోలుకోని దెబ్బ‌తీశాడు. సాయి సుద‌ర్శ‌న్‌తో క‌లిసి అత‌డు నెల‌కొల్పిన 84 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌దించాడు. ఇదే మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. 

ఈ విష‌య‌మై ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ ఓ లైవ్ స్ట్రీమింగ్ కార్య‌క్ర‌మంలో మాట్లాడాడు. "బుమ్రాకు స‌రైన స‌మ‌యంలో ముంబ‌యి కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఇచ్చాడు. సుద‌ర్శ‌న్ అత‌ని బౌలింగ్ అంత‌కుముందు బాగా ఆడాడు. అందుకే బుమ్రాకు కాస్త ఆల‌స్యంగా బంతిని ఇచ్చాడు. 

ఎప్పుడైతే బుమ్రా త‌న కోటాలో మిగిలిన రెండు ఓవ‌ర్లు బౌలింగ్ వేయ‌డానికి వ‌చ్చాడో అప్పుడే నా కుమారుడితో నేను ఒక విష‌యం చెప్పా. 'అత‌డి బౌలింగ్ పూర్త‌య్యేంత వ‌ర‌కు, ఈ మ్యాచ్ ముగియ‌న‌ట్లే' అన్నాను. తాను ఎందుకు అత్యుత్త‌మ‌మో బుమ్రా ఈ మ్యాచ్‌లో మ‌రోసారి నిరూపించుకున్నాడు" అని డివిలియ‌ర్స్ అన్నాడు. 

అలాగే సాయి సుద‌ర్శ‌న్ కూడా కీల‌క‌మైన స‌మ‌యంలో ఔట్ కావ‌డం మ్యాచ్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నాడు. ఇక‌, ఈ మ్యాచ్ లో జీటీకి ఏదీ అనుకూలంగా జ‌ర‌గ‌లేద‌ని డివిలియ‌ర్స్ తెలిపాడు. వారు ఏకంగా మూడు క్యాచ్‌లు డ్రాప్ చేశార‌ని, కీల‌క‌మైన ప్లేయ‌ర్ కుశాల్ మెండిస్ హిట్ వికెట్‌గా పెవిలియ‌న్ చేర‌డం కూడా దెబ్బ‌తీసింద‌ని ఆర్‌సీబీ మాజీ ఆట‌గాడు చెప్పుకొచ్చాడు. 
Jasprit Bumrah
Mumbai Indians
Gujarat Titans
IPL 2024
AB de Villiers
Sai Sudarshan
Hardik Pandya
Washington Sundar
Cricket
MI vs GT

More Telugu News