Revanth Reddy: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

- సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - పలు కీలక అంశాలపై చర్చ
- జూన్ 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం
- రాజీవ్ యువ వికాసంపై కేబినెట్లో ఫైనల్ డెసిషన్
- ఉద్యోగుల సమస్యలపైనా మంత్రివర్గంలోనే చర్చ
- ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్‌కు సీఎం ప్రశంస
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన వివిధ శాఖల పనితీరును, ప్రభుత్వ పథకాల అమలును సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలోనే, జూన్ 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేబినెట్ భేటీలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి.
నేటి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతి, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, రానున్న పంటల సీజన్‌కు సంబంధించి వ్యవసాయ సాగు సన్నద్ధత వంటి అంశాలపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులను ప్రకటించాలని స్పష్టం చేశారు. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరకూడదని ఆయన గట్టిగా చెప్పారు. ఈ పథకంపై తుది నిర్ణయాన్ని కేబినెట్లో చర్చించిన అనంతరం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలను భట్టి విక్రమార్క ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు వివరించారు. ఈ నివేదికలోని అంశాలను కూడా జూన్ 5న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు.
ఇదే సమయంలో, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.