Shreyas Iyer: ఐపీఎల్ ఫైనల్... ఎవరు గెలిచినా చరిత్రే... ఆర్సీబీపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

Shreyas Iyer Wins Toss Punjab Kings to Bowl First in IPL Final
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ పోరు నేడే
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య అమీతుమీ
  • అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక
  • టాస్ గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
  • మొదట బౌలింగ్ చేయాలని పంజాబ్ నిర్ణయం
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా ఫైనల్‌లో ఇరు జట్లు పటిష్టమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి.

ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కానీ, పంజాబ్ కింగ్స్ కానీ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అందుకే ఈ రెండు జట్లలో ఎవరు నెగ్గినా, వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్ అవుతుంది. ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్లకు ఈ రెండు జట్లలో ఒకటి విజేతగా నిలవనుండడం విశేషం. 

తుది జట్ల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్.

ఆర్‌సీబీ బెంచ్
సుయాష్ శర్మ, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, బ్లెస్సింగ్ ముజరబానీ, నువాన్ తుషార, మోహిత్ రాఠీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్.

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) 
ప్రియాంశ్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

పీబీకేఎస్ బెంచ్
ప్రభ్‌సిమ్రన్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, యశ్ ఠాకూర్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్.


Shreyas Iyer
IPL 2025
Royal Challengers Bangalore
Punjab Kings
RCB vs PBKS
IPL Final
Rajat Patidar
Narendra Modi Stadium
Indian Premier League
Cricket

More Telugu News