Etela Rajender: వాడిగా, వేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. నిధులపై ఈటల రాజేందర్ నిలదీత

- జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ
- వీధి దీపాలు, నాలాలు, వరదలు, ట్రాఫిక్‌పై ప్రశ్నల వర్షం
- అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు ఇవ్వాలని ఈటల డిమాండ్
- మూసీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఈటల హామీ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగింది. నగరంలోని పలు కీలక సమస్యలపై కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వీధి దీపాల నిర్వహణ, నాలాల విస్తరణ పనులు, వర్షాకాలంలో ఎదురవుతున్న వరదల సమస్య, నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులు వంటి అనేక అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తగా, అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, నగరంలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నిధుల కేటాయింపు విషయంలో పక్షపాతం తగదని, కేవలం గట్టిగా మాట్లాడే కార్పొరేటర్లకే నిధులు కేటాయించే పద్ధతిని విడనాడాలని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా, సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు మాట్లాడుతూ, చారిత్రక మూసీ నది పునరుజ్జీవం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా ఎంపీ ఈటల రాజేందర్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఈటల, నగరాభివృద్ధికి తాను ఎప్పుడూ మద్దతుగా నిలుస్తానని, అవసరమైన తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.