Madan Lal: విజయోత్సవాలపై అంత హడావుడి ఎందుకు?: మదన్ లాల్

Madan Lal on RCB Celebrations Stampede Tragedy
  • తొక్కిసలాట దుర్ఘటనపై స్పందించిన మాజీ క్రికెటర్ మదన్ లాల్
  • సరైన ప్రణాళిక లేకుండా, హడావుడిగా నిర్వహించడం వల్లే ఘోరం జరిగిందని ఆగ్రహం
  • సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే 11 మంది ప్రాణాలు కోల్పోయారని వ్యాఖ్య
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పందించారు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడైన మదన్ లాల్, ఆర్సీబీ యాజమాన్యం సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.

"మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లో సంబరాలు చేసుకున్నారు. మరుసటి రోజే బెంగళూరులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది? సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే అనవసరంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు" అని మదన్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ విజయోత్సవాలను నిర్వహించాయని తెలిపారు. బెంగళూరు జట్టు కావడం వల్లే తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని ఆయన విలేకరులతో అన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Madan Lal
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
Bangalore Stampede

More Telugu News