Jayam Ravi: మెడలో దండలతో జయం రవి.. కెనీషా ఫొటోలు వైరల్.. పెళ్లి అయిపోయిందా?

Jayam Ravi and Kenisha Photos Viral Marriage Speculation
  • చెన్నై గుడిలో పూలదండలతో జయం రవి, కెనీషా దర్శనం
  • వారిద్దరికీ పెళ్లయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ‘రవి మోహన్ స్టూడియోస్’ బ్యానర్ లోగో ఆవిష్కరించిన హీరో
కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి, నటి కెనీషా మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో పూల దండలతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారికి వివాహం జరిగిందా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

జయం రవి గురువారం తన సొంత నిర్మాణ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముందు ఆయన, కెనీషాతో కలిసి చెన్నైలోని ప్రసిద్ధ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులతో కలిసి దిగిన ఫోటోల్లో ఇద్దరి మెడలోనూ పూల దండలు కనిపించాయి. ఈ ఫోటోలే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ, వారి పెళ్లి గురించి రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.

కొంతకాలంగా జయం రవి వ్యక్తిగత జీవితం వార్తల్లో నానుతోంది. భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ఆయన గతేడాది అధికారికంగా ప్రకటించాడు. అయితే, కెనీషాతో జయం రవికి ఉన్న  సంబంధమే విడాకులకు కారణమంటూ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు జయం రవి, కెనీషా జంటగా హాజరుకావడం ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియాలో పలుమార్లు ఎమోషనల్ పోస్టులు పెట్టారు. తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జయం రవి కూడా స్పందిస్తూ ఆర్తి తనను అన్ని విధాలుగా నియంత్రించేదని ఆరోపించాడు. ఇలా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా, తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, జయం రవి, కెనీషాల తాజా ఆలయ సందర్శన పలు అనుమానాలకు తావిస్తోంది.
Jayam Ravi
Kenisha
Kollywood
Jayam Ravi divorce
Aarthi
Ravi Mohan Studios
Tamil actor
Chennai temple
marriage rumors
family drama

More Telugu News