Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డిపై పులివర్తి నాని ఫైర్

Pulivarthi Nani Fires on Chevireddy Bhaskar Reddy
  • వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చంద్రగిరి నియోజకవర్గ పరువు తీస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని
  • మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి వాటాను కూడా సిట్ త్వరలో తేలస్తుందన్న పులివర్తి
  • వైద్య శిబిరాలు, మొక్కలు పంపిణీ పేరుతో చెవిరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన పులివర్తి
చంద్రగిరి వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కరరెడ్డి నియోజకవర్గ పరువు తీస్తున్నారని విమర్శించారు.

చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. తుడాను అడ్డం పెట్టుకుని బినామీ కంపెనీ కేవీఎస్ ద్వారా దోచుకోలేదా అని నిలదీశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత చెవిరెడ్డికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

వైద్య శిబిరాలు, మొక్కలు పంపిణీ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాజ్ కసిరెడ్డితో సంబంధం లేదని చెవిరెడ్డి చెప్పగలరా అని నిలదీశారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి వాటాను కూడా త్వరలో సిట్ తేలుస్తుందని పులివర్తి నాని అన్నారు. ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి చెవిరెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము ఏనాడూ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని పులివర్తి పేర్కొన్నారు. 
Chevireddy Bhaskar Reddy
Pulivarthi Nani
Chandragiri
TDP
YSRCP
Corruption Allegations
Andhra Pradesh Politics
Tuda
Raj Kasireddy
Liquor Scam

More Telugu News