Chandrababu Naidu: నారాయణ జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Congratulates Narayana JEE Advanced Rankers
  • ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నారాయణ కళాశాల జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2025 ర్యాంకర్లు
  • ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ప్రవేశం సాధించడం సామాన్య విషయం కాదని ప్రశంసలు
  • జన్మభూమితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి పాటుపడాలని చంద్రబాబు సూచన
జేఈఈ అడ్వాన్స్‌డ్ - 2025 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విజయవాడ నారాయణ కళాశాల విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10, 51, 82, 98 ర్యాంకులు సాధించిన వడ్లమూడి లోకేశ్, భానుచరణ్ రెడ్డి, తోరాటి భరద్వాజ్, జస్వంత్ వెంకట రఘువీర్‌లను, వారి తల్లిదండ్రులను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రవేశం సాధించడం సామాన్య విషయం కాదని అన్నారు. ఇంతటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మభూమితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి పాటుపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సిధూర నారాయణ, శరణి నారాయణ పాల్గొన్నారు. 
Chandrababu Naidu
JEE Advanced 2024
Narayana College
Vijayawada
IIT
JEE Advanced Rankers
Andhra Pradesh
Education
Vadlamudi Lokesh
Bhanu Charan Reddy

More Telugu News