Gautam Adani: అదానీ కన్నా ఆయన ఎగ్జిక్యూటివ్ ల వేతనమే ఎక్కువట

Gautam Adani Salary Lower Than His Executives
  • అదానీ గ్రూప్ చైర్మన్ గా అదానీ గతేడాది అందుకున్న వేతనం రూ. 10.41 కోట్లు
  • అంతకుముందు ఏడాది అదానీ వార్షిక వేతనం రూ.9.26 కోట్లు
  • గ్రూప్ లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల నుంచే వేతనం
దేశవిదేశాల్లో పేరొందిన అదానీ గ్రూప్ కంపెనీలలో చైర్మన్ గౌతం అదానీ అందుకునే వేతనం ఆయన కంపెనీలోని పలువురు ఎగ్జిక్యూటివ్ ల కన్నా తక్కువే.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదానీ అందుకున్న వార్షిక వేతనం రూ.10.41 కోట్లు కాగా అంతకుముందు ఏడాది రూ.9.26 కోట్లు అందుకున్నారు. దేశంలోని మిగతా పారిశ్రామిక వేత్తలతో పోలిస్తే ఈ వేతనం చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. మిగత కంపెనీల సంగతి పక్కన పెడితే అదానీ గ్రూప్ లోనే పలువురు ఎగ్జిక్యూటివ్ ల వార్షిక వేతనం అదానీ అందుకున్న మొత్తంకన్నా చాలా ఎక్కువ ఉంటుందని సమాచారం.

అదానీ గ్రూప్ లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీలు ఉండగా అందులో కేవలం రెండు కంపెనీల నుంచి మాత్రమే అదానీ వేతనం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రూప్ లోని ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ అందుకున్న వేతనం (అలవెన్సులతో కలిపి) రూ. 2.54 కోట్లు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషనల్ ఎకనమిక్ జోన్ నుంచి రూ.7.87 కోట్లు (వేతనం ప్లస్ లాభాల్లో వాటా) అందుకున్నారు.
Gautam Adani
Adani Group
Adani salary
executive compensation
Indian industrialists
Adani Enterprises
Adani Ports
financial year
listed companies
wage comparison

More Telugu News