Revanth Reddy: కొత్త మంత్రులకు శుభాభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి... ముగ్గురూ తొలిసారి ఎమ్మెల్యేలే!

Revanth Reddy Congratulates New Telangana Ministers
  • తెలంగాణలో  మంత్రివర్గ విస్తరణ
  • నూతన మంత్రులు, డిప్యూటీ స్పీకర్ నియామకం
  • వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు
  • శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రు నాయక్ నియామకం
  • ఈ నలుగురు నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నూతన మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషెస్ తెలియజేశారు. నూతన మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా, శాసనసభ ఉపసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్ నియమితులయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారికి నా అభినందనలు. శాసనసభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ గారికి నా అభినందనలు..." అని పేర్కొన్నారు.

కాగా, మంత్రివర్గంలో చాన్స్ దక్కించుకున్న ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం. వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వాకిటి శ్రీహరి మక్తల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందగా, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి సెగ్మెంట్లో విజేతగా నిలిచారు. 

Revanth Reddy
Telangana Cabinet
Vivek Venkataswamy
Adluri Laxman
Vakiti Srihari
Ramachandru Naik
Telangana Ministers
Telangana Politics
Chennur
Makthal
Dharmapuri

More Telugu News