Revanth Reddy: మోదీ, చంద్రబాబు వద్ద చదువుకుని... రాహుల్ వద్ద ఉద్యోగం చేస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Studied with Modi and Chandrababu now working for Rahul
  • హైదరాబాదులో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ
  • హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా జరిగిన సంభాషణ వెల్లడించిన వైనం
ఇవాళ హైదరాబాదులో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని అందరితో పంచుకున్నారు.

ఇటీవల తాను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేశానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ... చంద్రబాబు గారిని చూపించి మీ సన్నిహితుడు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు నేను... స్కూల్ మీ (బీజేపీ) వద్ద చదువుకున్నాను... కాలేజి ఆయన (చంద్రబాబు) వద్ద చదువుకున్నాను... ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద  ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాను. దాంతో అందరూ నవ్వేశారు" అని రేవంత్ రెడ్డి వివరించారు. 
Revanth Reddy
Telangana CM
Narendra Modi
Chandrababu Naidu
Rahul Gandhi
NITI Aayog
Bandaru Dattatreya
Hyderabad
Haryana Governor
Telangana Politics

More Telugu News