BVS Ravi: నాకు నచ్చకపోతే పెద్ద సినిమాలే వదిలేశాను: రచయిత బీవీఎస్ రవి! 

BVS Ravi Interview
  • చాలా సినిమాలకి పనిచేశాను 
  • పెద్ద ప్రాజెక్టుల విషయంలో రాజీ పడ్డాను
  • మరికొన్ని ప్రాజెక్టుల నుంచి బయటికి వచ్చేశాను 
  • తప్పు చేశానేమోనని అనుకున్న సందర్భాలు ఉన్నాయన్న బీవీ ఎస్ రవి  

బీవీఎస్ రవి చాలా సినిమాలకు రైటర్ గా పనిచేశారు. ఆయన ఖాతాలో హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి బీవీఎస్ రవి తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నేను చాలా సినిమాలకు పనిచేశాను. ఆ ప్రాజెక్టుల విషయంలో కొన్ని సార్లు రాజీపడి పనిచేశాను. మరికొన్ని సార్లు వదిలేసి బయటికి వచ్చాను" అని చెప్పారు. 

"చిన్న సినిమాలకు పనిచేసేటప్పుడు రైటర్ కి ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే మిగతా టీమ్ అంతా కూడా చినవాళ్లే ఉంటారు గనుక. అదే పెద్ద సినిమాల విషయానికి వస్తే, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని పనిచేయవలసి ఉంటుంది. ఒక పెద్ద సినిమాకి డైలాగ్ వెర్షన్ రాశాను. ఆ కథ నాకు నచ్చలేదని చెప్పి లెటర్ కూడా రాసి .. ఆ స్క్రిప్ట్ తో పాటు పంపించాను. నిజంగానే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అలాంటప్పుడు నాకు ఆత్మ సంతృప్తి ఉంటుంది" అని అన్నారు. 

" గతంలో నేను కొన్ని తప్పులు చేశాను. మనదే కరెక్టు అని అవతల వారితో గొడవపడి ఇంటికి వచ్చేసిన తరువాత, నేను అలా చేయకుండగా ఉండవలసింది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా జరిగితే నాపై వాళ్ల కోపం ఇంకా పెరిగిపోతుంది. నేను చెప్పినట్టుగా జరగకపోతే, ఇంకోసారి వీడిని పిలవొద్దని అనుకుంటారు. కెరియర్లో ఇలాంటివన్నీ కామన్. జరిగిపోయినవాటిని మార్చలేం గనుక, నవ్వుతూ గుర్తు చేసుకోవాలంతే" అని అన్నారు.  

BVS Ravi
BVS Ravi writer
Telugu cinema writer
Telugu movies
Tollywood
Movie script
Dialogue writer
Telugu film industry
Interview

More Telugu News