Parawada Pharma City: పరవాడ ఫార్మాసిటీలో విషాదం: విషవాయువులను పీల్చి ఇద్దరు కార్మికుల మృతి

- పరవాడ ఫార్మాసిటీలోని సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం
- విషవాయువులను పీల్చడంతో ముగ్గురు కార్మికులకు అస్వస్థత
- షీలానగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక కార్మికుడు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో దుర్ఘటన సంభవించింది. ఫార్మాసిటీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు.
కార్మికులు చంద్రశేఖర్, కుమార్ మృతి చెందగా, మరో కార్మికుడు షీలానగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.