Manchu Vishnu: 'కన్నప్ప' నార్త్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఒకరోజు వాయిదా

- రేపు ఇండోర్ లో జరగాల్సిన 'కన్నప్ప' ప్రీరిలీజ్ ఈవెంట్
- విమాన ప్రమాద మృతులకు నివాళిగా ఈవెంట్ వాయిదా
- మృతులను తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందన్న మంచు విష్ణు
మంచు విష్ణు కథానాయకుడిగా, నిర్మాతగా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. సినీ ప్రచార కార్యక్రమాలు రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ దురదృష్టకర సంఘటన పట్ల మంచు విష్ణు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషాదానికి గుర్తుగా, రేపు ఇండోర్‌లో జరగాల్సిన "కన్నప్ప" సినిమా ఈవెంట్‌ను ఒక రోజు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తీవ్రమైన విషాద సమయంలో, 'కన్నప్ప' ట్రైలర్ విడుదలను ఒక రోజు వాయిదా వేస్తున్నాం, రేపటి ఇండోర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాం. ఈ ఊహించలేని కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రార్థనలు ఉంటాయి" అని విష్ణు మంచు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.