Samantha: తొలిసారిగా విదేశీ తెలుగు సభలకు సమంత.. అమెరికాలో అభిమానుల ఆనందం!

Samantha to Attend TANA Sabha in Detroit US
  • డెట్రాయిట్‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు
  • జులై 3 నుంచి 5 వరకు ఘనంగా నిర్వహణ
  • సభలకు హాజరు కానున్న ప్రముఖ నటి సమంత
  • మొదటిసారి విదేశీ తెలుగు వేడుకల్లో సమంత
  • ఏర్పాట్లు ముమ్మరం చేసిన తానా నిర్వాహకులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభల కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జులై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలోని సబర్బన్‌ కలెక్షన్‌ షో ప్లేస్‌లో 24వ తానా ద్వైవార్షిక మహాసభలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటి సమంత హాజరుకానుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆమె రాక ఖరారు కావడంతో నిర్వాహకులు కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక మహాసభలకు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారితో పాటు భారత్, అమెరికాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. తానా సభలకు సమంత హాజరవుతుండటం ఇదే మొదటిసారి. ముఖ్యంగా, విదేశాల్లో జరిగే తెలుగువారి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం కూడా ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.

సినీ కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలతో అగ్ర కథానాయికగా ఎదిగిన సమంత, కొంతకాలం విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా సమంత తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవలే ఆమె 'శుభం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు తానా మహాసభల ద్వారా అమెరికాలోని తన అభిమానులను నేరుగా కలుసుకోనుండటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Samantha
Samantha Ruth Prabhu
TANA
TANA 2025
North America Telugu Association
Telugu Association of North America

More Telugu News