Mukesh Ambani: ప్రపంచ టాప్-20 కుబేరుల జాబితాలో మనవాళ్లు

Mukesh Ambani Gautam Adani in World Top 20 Billionaires List
  • తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్
  • బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో 17, 20 స్థానాల్లో ముఖేశ్ అంబానీ, గౌతమ్ ఆదానీలు
  • టాప్ 100లో ధనవంతుల్లో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 20లో ముఖేష్ అంబానీ, ఆదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీలు స్థానాలు దక్కించుకోగా, టాప్ 100లో తొమ్మిది మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు.

ప్రతి ఏటా బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ (17వ స్థానం), గౌతమ్ ఆదానీ (20), శివనాడార్ (41), షాపూర్ మిస్త్రీ (52), సావిత్రి జిందాల్ (59), అజీమ్ ప్రేమ్ జీ (69), సునీల్ మిట్టల్ (73), దిలీప్ సంఘ్వీ (79), లక్ష్మీ మిట్టల్ (86వ స్థానం)లు వంద స్థానాల్లోపు ఉన్నారు. 
Mukesh Ambani
Gautam Adani
Bloomberg Billionaires Index
Indian billionaires
Richest people in the world
Reliance Industries
Adani Group
Shiv Nadar
Azim Premji
Top 100 billionaires

More Telugu News