Pawan Kalyan: వీరజవాన్ కుటుంబానికి పవన్ ఆర్ధిక సాయం రూ.25 లక్షలు అందజేత

- వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగత ఆర్ధిక సాయం చెక్కు పంపిన పవన్ కల్యాణ్
- మురళీనాయక్ తల్లిదండ్రులకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, జయకృష్ణ
- కల్యాణ్ మంచి మనసుకు ఇది నిదర్శనమన్న నేతలు
ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన మేరకు పవన్ కల్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ.25 లక్షలు అందజేశారు.
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో నివసిస్తున్న జవాన్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతి దంపతులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ నిన్న చెక్కును అందజేశారు. మురళీనాయక్ కుటుంబానికి తన సొంత నిధులు ఇవ్వడం పవన్ కల్యాణ్ మంచి మనసుకు నిదర్శనమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ హామీ మేరకు అధికారులు ఇప్పటికే రూ.50 లక్షలు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమిని మురళీనాయక్ కుటుంబానికి అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు.