Tirumala steps: తిరుమల మెట్ల దారిలో విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి

Tirumala tragedy Jafar from Kalyanadurgam dies of heart attack



తిరుమల విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వైద్య సాయం అందేలోపే కన్నుమూశాడు. శనివారం తిరుమల మెట్ల దారిలో చోటుచేసుకుందీ విషాదం. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన జాఫర్ (25) తన బంధువులతో కలిసి తిరుమలకు వెళ్లాడు. ఈ క్రమంలో కొండపైకి మెట్లు ఎక్కుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యలోనే జాఫర్ తుదిశ్వాస విడిచాడని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tirumala steps
Heart attack
Jafar
Tirumala
Andhra Pradesh
Kalyanadurgam
Pilgrimage
Cardiac arrest

More Telugu News