Nagarjuna: 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవిగో!

- హైదరాబాదులో నాగార్జున, ధనుష్‌ల ‘కుబేర’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక
- దర్శకుడు శేఖర్ కమ్ములను కేవీ రెడ్డితో పోల్చిన నాగార్జున
- ధనుష్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని వెల్లడి
- ఈ సినిమా తనకు తెలుగులో రెండోదని, తమిళంలో 51వ చిత్రమని ధనుష్ వెల్లడి
- కుబేర’ కొత్త అంశంతో, అసలైన పాన్ ఇండియా సినిమా అని శేఖర్ కమ్ముల ధీమా
- వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి హాజరు
అక్కినేని నాగార్జున, ప్రముఖ తమిళ నటుడు ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో, విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. ఈ యాక్షన్ డ్రామా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై నాగార్జున, ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రష్మిక తదితరులు సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ధనుష్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని, ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. "ఇది పూర్తిగా శేఖర్ కమ్ముల సినిమా. మేమంతా కేవలం పాత్రధారులం మాత్రమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్‌ల నుంచి బయటకు తీసుకువచ్చారు," అని నాగార్జున తెలిపారు. ‘మాయాబజార్’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వంటి మహానటులు ఉన్నప్పటికీ, ఆ సినిమాకు దర్శకుడు కేవీ రెడ్డి ఎలా హీరోనో, అలాగే ‘కుబేర’ చిత్రానికి శేఖర్ కమ్ముల హీరో అని ఆయన ప్రశంసించారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తనకు అసలైన టీమ్ వర్క్ కనిపించిందని, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలమని కొనియాడారు. త్వరలో 'శివ' సినిమా రీ రిలీజ్ అవుతుందని అభిమానులకు శుభవార్త తెలిపారు.
నటుడు ధనుష్ మాట్లాడుతూ, వేదికపై ప్రదర్శించిన తన ఏవీ (ఆడియో విజువల్) చూస్తుంటే తన తండ్రి గుర్తుకొచ్చారని, ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. "ఈ సినిమా కోసం శేఖర్ సర్ చాలా శ్రమించారు. ‘కుబేర’ తమిళంలో నాకు 51వ సినిమా కాగా, తెలుగులో ఇది నా రెండో చిత్రం. నిజానికి ‘సార్’ సినిమా కంటే ముందే శేఖర్ గారు నాకు ఈ కథ చెప్పారు. ఇందులో నటించే అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు," అని ధనుష్ పేర్కొన్నారు. నాగార్జున గారితో కలిసి నటించడం ఆనందంగా ఉందని, రష్మిక చాలా కష్టపడి పనిచేసే నటి అని ప్రశంసించారు. ఈ సినిమాపై దర్శకుడు శేఖర్ కమ్ములకు ఉన్న నమ్మకం చూస్తుంటే తనకు భయంగా ఉందని ధనుష్ సరదాగా వ్యాఖ్యానించారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ఆహ్వానించగానే విచ్చేసిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. "సినిమా పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అందుకే తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నాను. పనులు పూర్తి కాగానే ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటాను," అని అన్నారు. "నా దృష్టిలో ‘కుబేర’ సినిమా నాకు తల్లి లాంటిది. ధనవంతుడైనా, పేదవాడైనా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాంటి కథను తెరకెక్కించే అవకాశం రావడం నా అదృష్టం. నా గత సినిమాల విషయంలో సరస్వతీ దేవి తలవంచుకోకుండా ఉంటే చాలు అనేవాడిని. కానీ, ఈ సినిమాను సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుంది. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు. మీరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త అంశంతో ఈ సినిమా రూపొందింది. ఇది అసలైన పాన్ ఇండియా సినిమా, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇందులో ఎమోషన్, కామెడీ, థ్రిల్ అన్నీ ఉంటాయి," అని శేఖర్ కమ్ముల ధీమా వ్యక్తం చేశారు.
ఇది తన శైలికి భిన్నమైన సినిమా అని చాలామంది అంటున్నారని, కేవలం తనకే కాదు, తెలుగు సినిమాల్లోనే ఇది ఒక ప్రత్యేకమైన చిత్రమవుతుందని అన్నారు. కథ విషయంలో చైతన్య పింగళి సహాయం చేశారని తెలిపారు. నాగార్జున గారితో స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పటికీ, ఆయన్ను డైరెక్ట్ చేయడం కొంత టెన్షన్‌గా అనిపించిందని, స్క్రిప్ట్ వినగానే నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం కూడా ఆయన షూటింగ్‌కు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ధనుష్ పోషించని పాత్ర అంటూ లేదని, నటనలోనే కాకుండా అన్ని విభాగాల్లో ఆయనకు పట్టుందని కొనియాడారు. చెప్పినట్టుగానే పాత్ర కోసం సన్నబడ్డారని, ఫస్ట్‌షాట్‌తోనే ఆయన నటనకు తాను ఇంప్రెస్ అయ్యానని శేఖర్ కమ్ముల వివరించారు.
నటి రష్మిక మందన్న మాట్లాడుతూ, "నా సినీ ప్రయాణానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది. ఇన్ని పాత్రలు పోషించానా అని ఆశ్చర్యం కలిగింది," అన్నారు. ఒక సినిమా పూర్తవడానికి ఏడాది సమయం పడుతుందని, ఆ సమయంలో చిత్ర బృందంతో మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు. తాను తన కుటుంబాన్ని కలిసి ఏడాది అయిందని అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని, ఆయన ఎక్కువగా రియల్ లొకేషన్లలోనే షూటింగ్ చేస్తారని తెలిపారు. నాగార్జున గారితో ఇది తన రెండో చిత్రమని, ఆయన మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ప్రశంసించారు. ధనుష్‌తో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉందని, ఈ చిత్రంలోని తమ కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.ఎస్. రాజమౌళి, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ నిజంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉందని చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుక సినీ ప్రముఖులు, అభిమానుల కోలాహలం మధ్య సందడిగా ముగిసింది.