Lufthansa Airlines: జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు... వెనక్కి మళ్లింపు!

Lufthansa Airlines Flight to Hyderabad Returns to Frankfurt After Bomb Threat
  • బోయింగ్ 787 -9 డ్రీమ్ లైనర్ రకానికి చెందిన ఎల్ హెచ్ 752 ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు
  • జర్మనీలోని ఫ్రాంక్ పర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఫ్లైట్ రెండు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి
  • బల్గేరియన్ గగనతలం నుంచి విమానం వెనక్కి మళ్లింపు   
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు సాధారణ విషయంగా మారుతున్నాయి. తప్పుడు బెదిరింపు కాల్స్ కారణంగా పోలీసులు, భద్రతా సిబ్బంది హడావుడిగా తనిఖీలు నిర్వహించడం, చివరికి ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా జర్మనీ నుండి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది.

బాంబు బెదిరింపుతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్ బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం భద్రతా కారణాల దృష్ట్యా తిరిగి వెనక్కి వెళ్లింది. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. ఆ తర్వాత విమానాన్ని భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఎల్ హెచ్ 752 విమానం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుండి అక్కడి కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ (హైదరాబాద్) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న అర్ధరాత్రి 1.20 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా బల్గేరియన్ గగనతలం నుండి విమానాన్ని వెనక్కి మళ్లించారు. 
Lufthansa Airlines
Lufthansa Flight LH752
Hyderabad
Bomb threat
Frankfurt
Germany
Rajiv Gandhi International Airport
Shamshabad
Boeing 787-9 Dreamliner

More Telugu News