Raja Raghuvanshi: ఇండోర్ హనీమూన్ జంట విషాదం: భర్త మృతదేహం వద్ద భార్య షర్ట్.. చివరి వీడియోలో కీలక దృశ్యాలు

Raja Raghuvanshi Honeymoon Tragedy Wifes Shirt Found Near Body
  • ఇండోర్‌లో హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం
  • ఘటనకు ముందు రికార్డయిన జంట చివరి వీడియో వెలుగులోకి
  • దర్యాప్తులో వీడియో ఫుటేజ్, లభించిన షర్ట్ కీలకంగా మారే అవకాశం
హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మేఘాలయలో సోనమ్, రాజా కలిసి రికార్డు చేసుకున్న చివరి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో భార్య సోనమ్ ధరించి కనిపించిన షర్ట్.. రాజా మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు వారీ వీడియోను తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
 
ఈ వీడియోలో సోనమ్ ఒక షర్ట్ ధరించి కనిపించింది. అదే షర్ట్‌ను పోలీసులు ఆమె భర్త మృతదేహం లభ్యమైన ప్రదేశంలో కనుగొన్నారు. దీంతో ఈ షర్ట్ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ షర్ట్ అక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఏం జరిగిందనేది అంతుచిక్కకుండా ఉంది.

ప్రస్తుతం పోలీసులు ఈ వీడియో ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోనమ్‌ను కూడా విచారించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చివరి వీడియో, ఘటనా స్థలంలో లభించిన షర్ట్ ఆధారంగా రాజా మృతికి గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.  
Raja Raghuvanshi
Meghalaya
Honeymoon Murder
Indore Businessman
Sonam
Last Video
Shirt Evidence
Crime Investigation

More Telugu News