Seethakka: రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క

- కవిత జైలుకెళ్లి బీసీ ఎజెండా ఎత్తుకున్నారన్న సీతక్క
- కేటీఆర్ కూడా జైలుకి వెళ్లాలనుకుంటున్నారని ఎద్దేవా
- తోడేళ్లలా దోచుకుని వినయం నటిస్తున్నారని మండిపాటు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.
వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. "కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లివచ్చి బీసీ ఎజెండాను అందుకున్నారు. తాను వెనుకబడ్డాననే భావనతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో" అంటూ వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని, తోడేళ్లలా దోచుకుని ఇప్పుడు వినయం నటిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. "కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే, మా ముఖ్యమంత్రి పౌరుషంతో మాట్లాడుతున్నారు" అని సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లేముందు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచారని, ముప్పైసార్లు పిలిచినా తాను హాజరవుతానని అందులో పేర్కొన్నారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి కొందరు రాక్షసానందం పొందుతున్నారని, అవసరమైతే తనను అరెస్టు కూడా చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను జైలుకు వెళ్లి వచ్చానని, తనకు జైళ్లు, కేసులు కొత్తేమీ కాదని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. కేటీఆర్ జైలు గురించి చేసిన ఈ వ్యాఖ్యలపైనే మంత్రి సీతక్క పైవిధంగా స్పందించారు.