Mohan Babu: పెదరాయుడికి 30 ఏళ్లు, కన్నప్ప మూవీ చూసిన రజనీ... మోహన్ బాబు హ్యాపీ

Mohan Babu Celebrates Pedarayudu 30 Years Rajinikanth Views Kannappa
  • 'పెదరాయుడు' సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తి
  • అదే రోజు 'కన్నప్ప' సినిమాను వీక్షించిన రజినీకాంత్
  • కుటుంబ సభ్యులతో కలిసి 'కన్నప్ప' చూసిన తలైవా
  • సినిమాపై రజినీకాంత్ ఆప్యాయత, ప్రోత్సాహం అందించారని వెల్లడి
  • మిత్రుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మోహన్ బాబు సోషల్ మీడియా పోస్ట్
  •  రజినీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనన్న కలెక్షన్ కింగ్
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు జూన్ 15వ తేదీ ఒకేసారి రెండు సంతోషకరమైన సంఘటనలు జరిగాయి. ఆయన సినీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'పెదరాయుడు' సినిమా విడుదలై మూడు దశాబ్దాలు పూర్తి చేసుకోగా, అదే రోజున ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించి, ప్రశంసించారు. ఈ ఆనందాన్ని మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన 'పెదరాయుడు' చిత్రం 1995 జూన్ 15న విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలై నిన్నటికి (జూన్ 15) సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రత్యేకమైన రోజునే మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు హీరోగా నటిస్తూ, మోహన్ బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'ను ఆయన ఆప్తమిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.

సినిమా చూసిన అనంతరం రజినీకాంత్ అందించిన స్పందన తనకెంతో ఆనందాన్నిచ్చిందని మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, "జూన్ 15న 'పెదరాయుడు' విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజున నా ఆప్తమిత్రుడు రజినీకాంత్ తన కుటుంబంతో కలిసి 'కన్నప్ప' సినిమా చూశారు. సినిమా చూశాక ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు మిత్రమా" అని పేర్కొన్నారు.

ఈ మేరకు మోహన్ బాబును కలిసినప్పటి ఫొటోలను కూడా మోహన్ బాబు పంచుకున్నారు. ఇందులో  పెదరాయుడు 30 ఏళ్ల వేడుకను పురస్కరించుకుని రజనీతో కేక్ కట్ చేయించడం కూడా చూడొచ్చు.
Mohan Babu
Pedarayudu
Kannappa Movie
Rajinikanth
Vishnu Manchu
Telugu Cinema
30 Years
Movie Review
Film Celebration
Tollywood

More Telugu News