Harish Rao: హరీశ్ రావుకు అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక

Harish Rao Health Scare Hospitalized in Hyderabad
  • తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హరీశ్ రావు
  • కేటీఆర్‌తో మీడియా సమావేశంలో మధ్యలోనే వెళ్లిన హరీశ్ రావు
  • ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.

ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే, అప్పటికే హరీశ్ రావు జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. మీడియా సమావేశంలో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆయన మరింత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ మీడియా సమావేశం మధ్యలోనే ముగించి, హరీశ్ రావును పంపించేశారు.

వెంటనే పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. హరీశ్ రావు ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
Harish Rao
BRS
KTR
KIMS Hospital
Telangana Politics
Health Update
Fever

More Telugu News