Air India: మరో ఎయిరిండియా ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య .. పైలెట్ అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు

Air India Flight Technical Issue Averted by Pilot Alertness
  • శాన్ ప్రాన్సిస్కో నుంచి ముంబయి చేరుకోవాల్సిన విమానంలో సాంకేతిక లోపం
  • కోల్‍‌కతాలో విమానాశ్రయంలో విమానాన్ని నిలుపుదల చేసి ప్రయాణికులను దించేసిన వైనం
  • ఆదివారం ఘజియాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లవలసిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య 
గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో, విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో నిలుపుదల చేసి ప్రయాణికులను దించేశారు.

శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి బయలుదేరిన ఎయిరిండియా విమానం (ఏఐ 180) సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్‌కతాలో విమానాన్ని నిలుపుదల చేసి ప్రయాణికులను దించేశారు.

దీనికి ఒక రోజు ముందు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లవలసిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో అధికారులు విమానాన్ని విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ వరుస ఘటనలు విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదాలు తప్పినట్లు భావిస్తున్నారు. 
Air India
Air India flight
Kolkata Airport
technical issue
flight emergency landing
San Francisco to Mumbai
AI 180
flight safety
pilot alert
aviation safety

More Telugu News