Vasantha Krishna Prasad: జోగికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వార్నింగ్

Vasantha Krishna Prasad Warns Jogi Ramesh After TDP Victory
  • తాము తల్చుకుంటే జోగి రమేశ్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేదన్న వసంత కృష్ణప్రసాద్
  • చంద్రబాబు సూచనలతో సంయమనం పాటిస్తున్నామని వెల్లడి
  • గతంలో మాదిరిగా వ్యవహరిస్తానని జోగి అంటే తాము ఎవరిమాట వినమన్న కేపీ
భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తలచుకుంటే జోగి రమేశ్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేదని మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (కేపీ) అన్నారు. జోగి రమేశ్ విషయంలో తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.

తొలి శాసనసభాపక్ష సమావేశంలోనే చంద్రబాబు నాయుడు తమకు కీలక సూచనలు చేశారని, ఎవరిపైనా దురుసుగా వెళ్లవద్దని, హుందాగా వ్యవహరించమని చెప్పారన్నారు. గతంలో మాదిరి జోగి రమేశ్ చంద్రబాబుపై ప్రేలాపనలు చేస్తే ఈసారి ఎవరు ఆపినా ఆగబోమని హెచ్చరించారు. గతంలో మాదిరిగా వ్యవహరిస్తానని జోగి రమేశ్ అంటే మాత్రం తాము చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు కూడా వినమని జోగికి హెచ్చరికలు చేశారు.

నోరు అదుపులో పెట్టుకోవాలని జోగికి సూచించారు. కొండపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ విజయం అనంతరం కేపీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై జోగి రమేశ్ వ్యాఖ్యలు అసంబద్ధమని, వైకాపా నేతలకు రాజధానిపై ఉన్న చిత్తశుద్ధి గత ఐదేళ్లలో అందరూ చూశారని కేపీ అన్నారు. 
Vasantha Krishna Prasad
Jogi Ramesh
TDP
Chandrababu Naidu
Mylavaram
Andhra Pradesh Politics
Kondapalli Municipality
Amaravati
Pawan Kalyan
Telugu Desam Party

More Telugu News