YS Sharmila: తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ అంశంలో మరో మలుపు... షర్మిల ఫోన్ ట్యాప్!

YS Sharmila Phone Tapped in Telangana Phone Tapping Case
  • వైసీపీ హయాంలో షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తింపు
  • కోడ్ భాష వాడి సంభాషణలు రికార్డ్ చేశారని ఆరోపణ
  • వివరాలు ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేశారని సమాచారం
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు కూడా చేరినట్లు తెలుస్తోంది. 

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల మొబైల్ ఫోన్లను అత్యంత రహస్యంగా ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా కోడ్ భాషను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. షర్మిల వాయిస్ సంభాషణలను రికార్డు చేయడమే కాకుండా, ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ఆమె సోదరుడి (జగన్‌)కి చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. షర్మిల ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే దానిపై నిశితంగా నిఘా పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, షర్మిలకు సన్నిహితంగా ఉండే కొందరిని ఓ సీనియర్ పోలీస్ అధికారి పిలిపించి హెచ్చరించినట్లు కూడా గుర్తించారు.

తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయాన్ని షర్మిల అప్పట్లోనే పసిగట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆమె వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
YS Sharmila
Telangana phone tapping case
Andhra Pradesh Congress
Phone tapping investigation
Telangana SIT
Jagan Mohan Reddy
Political surveillance
Mobile phone tapping
Code language
Voice recording

More Telugu News