R Narayana Murthy: సమస్యలపై అడిగితే 'అన్నలు' అంటున్నారు: ఆర్ నారాయణమూర్తి

R Narayana Murthy Criticizes Labeling Questioners as Naxalites
  • హైదరాబాద్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహణ
  • ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్
  • కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం
ప్రశ్నించే వారిని నక్సలైట్లుగా ముద్ర వేయడం సరికాదని, సమస్యలపై గళమెత్తేవారిని 'అన్నలు' అంటూ నిందిస్తున్నారని, తప్పులు చేసినా మౌనంగా ఉండేవారిని ఏమీ అనడం లేదని ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి, మావోయిస్టు సంఘాల నేతలతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతియుత చర్చలు ప్రారంభించాలని కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌లో మహాధర్నా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నిరసనలో తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, "ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. అడవుల నుంచి వారిని తరిమివేసి, విలువైన అటవీ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది" అని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తూ, వారి జీవనాధారాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
R Narayana Murthy
Operation Kagar
Maoists
Telangana
Kaggar Operation
Naxalites
Kothandaram
Adivasis
Human Rights

More Telugu News