Kannappa Movie: ఏపీ హైకోర్టులో 'కన్నప్ప'కు ఊరట

Kannappa Movie Gets Relief in AP High Court
  • కన్నప్ప మూవీపై ఏపీ హైకోర్టులో విచారణ
  • మోహన్ బాబు, విష్ణు, సీబీఎఫ్‌సీలకు నోటీసులు
  • మూవీ విడుదలయ్యాక అభ్యంతరకర విషయాలు ఉంటే తొలగింపుకు ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు
  • తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా
మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి, నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిన్న ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నెల 27న చిత్రం విడుదల కానున్నందున ఆ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఇందుకు అంగీకరించని హైకోర్టు.. ప్రతివాదులైన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీబీఎఫ్ సీ, సీఈవో, సీబీఎఫ్ సీ ప్రాంతీయ కార్యాలయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్, నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి. వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.

సినిమా విడుదల అయ్యాక అభ్యంతరకర విషయాలు ఉంటే తొలగించేలా ఆదేశిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో కన్నప్ప చిత్రం విడుదలకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. 
Kannappa Movie
Manchu Mohan Babu
Vishnu Manchu
AP High Court
Brahmin Community
Movie Release
Film Controversy
Mukesh Kumar
Brahmanandam
Telugu Cinema

More Telugu News