Jagan: జగన్ పర్యటన... మరో వ్యక్తి మృతి

- పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో ఇద్దరి మృతి
- ఏటుకూరు వద్ద కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు సింగయ్య మరణం
- సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక జయవర్ధన్ రెడ్డి మృతి
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో తీవ్ర విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఏటుకూరు బైపాస్ వద్ద సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.
మరో ఘటనలో, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం, తోపులాటలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి (ఆటోమొబైల్ షాపు నిర్వాహకుడు) ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.