Peddi: రామ్ చ‌ర‌ణ్ 'పెద్ది'లో మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు.. 'రామ్ బుజ్జి' ఫస్ట్ లుక్ విడుదల!

Ram Charan Peddi Movie Divyenndu Sharma First Look Released
  • 'పెద్ది'లో నటిస్తున్న దివ్యేందు శర్మ
  • దివ్యేందు బ‌ర్త్‌డే కానుక‌గా 'రామ్ బుజ్జి' క్యారెక్టర్ పోస్టర్ విడుదల
  • క్రికెట్ బాల్‌తో ఫోకస్డ్ లుక్ లో దివ్యేందు
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా మూవీ
  • 2026 మార్చి 27న సినిమా విడుదల.. ఏఆర్ రెహమాన్ సంగీతం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, 'మిర్జాపూర్' వెబ్ సిరీస్ తో విశేషంగా ఆకట్టుకున్న దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో దివ్యేందు శర్మ చేతిలో క్రికెట్ బాల్ తిప్పుతూ, సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు 'రామ్ బుజ్జి' అని మేకర్స్ ప్రకటించారు. ఈ పవర్‌ఫుల్ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు ఎలా మలిచారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'మిర్జాపూర్' సిరీస్‌లో మున్నా భాయ్‌గా దివ్యేందు నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో మెప్పిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.

'పెద్ది' చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. పాన్-ఇండియా స్థాయిలో, బహుభాషా చిత్రంగా 'పెద్ది'ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దివ్యేందు శర్మ చేరికతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
Peddi
Ram Charan
Divyenndu Sharma
Bucchibabu Sana
Mirzapur
Ram Bujji
Shiva Rajkumar
AR Rahman
Telugu Movie
Sports Drama

More Telugu News