Kanna Lakshminarayana: కమ్మవారిపై ద్వేషంతో అమరరాజాను తరిమేశారు: జగన్ పై కన్నా ఫైర్

Kanna Lakshminarayana Fires at Jagan Over Amararaja Issue
  • పల్నాడులో జగన్ పర్యటనపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు
  • ఓదార్పు యాత్రలా కాకుండా యుద్ధానికి వెళ్లినట్లుందని వ్యాఖ్య
  • నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే నూటికి నూరు శాతం కారణమని ఆరోపణ
వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పర్యటన ఓదార్పులా కాకుండా పల్నాడుపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. నాగమల్లేశ్వరరావు మృతికి నూటికి నూరు శాతం జగనే కారణమని కన్నా ఆరోపించారు. పోలీస్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడం అవాస్తవమన్నారు.

"నిన్న పల్నాడులో అరాచక ర్యాలీ నిర్వహించారు. ఈ పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారు" అని కన్నా మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను బయటకు రాకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. జగన్ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. కమ్మవారిపై ద్వేషంతోనే అమరరాజా పరిశ్రమను తరిమేశారని, అమరావతిని సర్వనాశనం చేశారని కన్నా ఆరోపించారు. నిన్నటి ఘటనల్లో ఇద్దరి మృతికి జగనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 
Kanna Lakshminarayana
Jagan Mohan Reddy
Amararaja
Palanadu
TDP
YS Jagan
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Pawan Kalyan
Amaravati

More Telugu News