KlinKaara: రామ్ చ‌ర‌ణ్ గారాల‌ప‌ట్టి క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి..!

See How Ram Charans Daughter KlinKaara Is Doing Now
  • నేడు క్లీంకార రెండో పుట్టిన‌రోజు
  • జూలో తెల్ల పులితో దిగిన చిన్నారి ఫొటోను షేర్ చేసిన ఉపాస‌న‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్‌ ఫొటో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంప‌తుల గారాలపట్టి, మెగా వారసురాలు క్లీంకార. చిన్నారి ముఖాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారోన‌ని అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. అయితే, చెర్రీ-ఉపాస‌న మాత్రం ఎక్క‌డా క్లీంకార ఫేస్‌ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉపాసన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ ఫోటోస్ షేర్ చేసినా 'క్లీంకార' ఫేస్‌ను మాత్రం ఎమోజీస్‌తో మేనేజ్ చేస్తుంటారు. 

ఈ క్ర‌మంలో ఈరోజు చిన్నారి క్లీంకార రెండో పుట్టిన రోజు సంద‌ర్భంగా జూలో తెల్ల పులితో దిగిన లేటెస్ట్ ఫొటోను ఉపాస‌న షేర్ చేశారు. హైద‌రాబాద్‌లోని జూలో ఉండే పులిపిల్ల‌ను ద‌త్త‌త తీసుకుని, దానికి క్లీంకార అని పేరు పెట్టిన‌ట్లు పేర్కొన్నారు. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు తాము మ‌ద్ద‌తిస్తున్నామంటూ ఉపాస‌న ట్వీట్ చేశారు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక‌, రామ్ చరణ్, ఉపాసన 'క్లీంకార'తో ఎప్పుడు బయటకొచ్చినా మీడియా కెమెరాలన్నీ వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా క్లీంకారను చూపించేందుకు తాపత్రయపడుతుంటాయి. ఎంత ప్రయత్నించినా చిన్నారి ఫేస్ మాత్రం చూపించలేకపోయాయి.


KlinKaara
Ram Charan
Upasana
KlinKaara birthday
Ram Charan daughter
Upasana daughter
Hyderabad Zoo
White tiger adoption
Mega family
Telugu cinema news

More Telugu News