Dhanush: థియేటర్లో కుబేర మూవీ చూస్తూ ఎమోషనల్ అయిన ధనుష్!

- ధనుష్, నాగార్జున కలిసి నటించిన మూవీ కుబేర
- తొలిసారిగా బిచ్చగాడి పాత్రలో నటించిన హీరో ధనుష్
- కుమారుడితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్ లో మూవీని వీక్షించిన ధనుష్
- బిచ్చగాడిగా తన పాత్రను చూసుకుని భావోద్వేగానికి గురయిన ధనుష్
తమిళ స్టార్ హీరో ధనుష్ తాను నటించిన 'కుబేర' మూవీని థియేటర్లో చూసి భావోద్వేగానికి గురయ్యారు. అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
తొలిసారిగా ధనుష్ ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్ర పోషించారు. తాజాగా ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్లో తన కుమారుడితో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. వెండితెరపై తన పాత్రను చూసుకుని ధనుష్ భావోద్వేగానికి గురయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసి ఎమోషన్ అయినట్లు కనిపిస్తున్నారు.
ధనుష్ ఇదివరకే అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, ఇప్పుడు ఓ బిచ్చగాడి పాత్రలోనూ నటించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ఈ చిత్రంపై మంచి రివ్యూలు వస్తుండటంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ధనుష్, నాగార్జునలలో ఎవరు హీరో అనేది చెప్పలేని విధంగా ఉందని అభిమానులు అంటున్నారు. సినిమా కథే విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది.