Air India: టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్-ముంబై ఎయిర్ ఇండియా విమానం రద్దు

Air India Flight Cancelled Due to Technical Issue in Hyderabad
  • ఎయిర్ ఇండియా ఏఐ2534లో సాంకేతిక సమస్య
  • టేకాఫ్ సమయంలో గుర్తించి విమానాన్ని నిలిపివేసిన పైలట్
  • ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ2534 సాంకేతిక కారణాలతో రద్దయింది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో లోపాన్ని గుర్తించడంతో వెంటనే విమానాన్ని రద్దు చేశారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికులు అప్పటికే బోర్డింగ్ పూర్తిచేసి సీట్లలో కూర్చున్నారు. ఈ సమయంలో పైలట్ ఒక సాంకేతిక సమస్యను గుర్తించాడు. దీంతో అప్రమత్తమై వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అయితే, విమానంలో ఎలాంటి లోపం జరిగిందన్న దానిపై ఎయిర్ ఇండియా అధికారులు స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఇది మామూలు భద్రతా తనిఖీల్లో భాగంగా గుర్తించిన సమస్య అని చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని, అందుకే ముందుజాగ్రత్తగా విమానాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు.
 
రద్దు చేసిన విమానంలోని ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా బదులుగా ఇతర విమానాల్లో సీట్లు ఏర్పాటు చేసింది. కొందరికి టికెట్‌ డబ్బును పూర్తిగా రీఫండ్ చేసేందుకు కూడా సిద్ధమైంది. తాజా ఘటన విమాన ప్రయాణాల్లో భద్రతా లోపాలను మరోమారు బయటపెట్టింది. అయితే, ప్రయాణికుల ప్రాణాలతో రాజీ పడకుండా ముందే లోపాన్ని గుర్తించి చర్యలు తీసుకున్న ఎయిర్ ఇండియా నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.  
Air India
Air India flight
Mumbai
Hyderabad
Flight cancellation
Technical issue
Rajiv Gandhi International Airport
AI2534
Flight safety
Airline

More Telugu News