Shruti Haasan: నా శరీరం... నా ఇష్టం: శృతిహాసన్

Shruti Haasan Opens Up About Plastic Surgery and Personal Choices
  • తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నానన్న శృతి
  • ముఖ సౌందర్యం కోసం ఫిల్లర్స్ వాడానని వెల్లడి
  • భవిష్యత్తులో ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకోవచ్చని వ్యాఖ్య
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్, తన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీల విషయంలో తన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు. తాజాగా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా వివరించారు.

"టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అంతేకాదు, ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడాను" అని ఆమె తెలిపారు. "ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నేను నమ్ముతున్నాను" అని శృతి వివరించారు.

భవిష్యత్తులో అవసరమైతే ఫేస్‌లిఫ్ట్ కూడా చేయించుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. "ఇది పూర్తిగా నా నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అని శృతి హాసన్ స్పష్టం చేశారు. కాగా, శృతి ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి 'కూలీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Shruti Haasan
Shruti Haasan plastic surgery
Coolie movie
Rajinikanth
cosmetic surgery
face fillers
Tollywood
Kollywood
Bollywood
actress

More Telugu News