Raviteja: 'రప్పా రప్పా నరుకుతాం' ప్లకార్డును ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తకు రిమాండ్

- జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఘటన
- నరుకుతామంటూ ప్లకార్డును ప్రదర్శించిన రవితేజ
- 14 రోజుల రిమాండ్ విధించిన సత్తెనపల్లి కోర్టు
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల (పల్నాడు జిల్లా) పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి. '2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని' అంటూ రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ క్రమంలో ప్లకార్డును ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని సత్తెనపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు.