Sekhar Kammula: కుబేర సినిమా నిడివిపై శేఖర్ కమ్ముల వివరణ ఇదే..!

Sekhar Kammula clarifies Kubera movie length
––
శేఖర్ కమ్ముల తాజా చిత్రం కుబేర నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్‌ ప్రెస్‌మీట్‌ లో శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు. నిడివి విషయంలో ఎక్కడ కత్తెర వేయాలనే విషయం దర్శకుడిగా తనకు తెలుసని, అయితే, ఈ సినిమాకు అవసరమేనని అన్నారు.

ప్రెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ‘కుబేర’ అద్భుతమైన చిత్రం. ఈ కథ అనుకున్నప్పటినుంచే సినిమాను వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాం. బడ్జెట్‌ పెరిగిపోతున్న ప్రతిసారీ కథలో కోతలు విధించాలనుకున్నా. ఆ టైంలో నా టీమ్‌ ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. నిడివి విషయానికి వస్తే.. అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ సినిమాలో ప్రతీ సీన్ ఉండాల్సిందే. కత్తెర వేయడానికి అవకాశం లేనంతగా చేశాకే నిడివి ఇలా ఉంది. ఈ సినిమాలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నా’’ అని శేఖర్‌ కమ్ముల చెప్పారు.
Sekhar Kammula
Kubera movie
Dhanush
Nagarjuna
Kubera review
Telugu cinema
Sekhar Kammula interview
Kubera length
movie success meet
Telugu movies 2024

More Telugu News