Telangana EdCET: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 96.38 శాతం ఉత్తీర్ణత

Telangana EdCET Results Released
  • తెలంగాణ ఎడ్‌సెట్-2025 ఫలితాలు విడుదల
  • మొత్తం 96.38 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత
  • హైదరాబాద్‌కు చెందిన గణపతిశాస్త్రికి 126 మార్కులతో ప్రథమ ర్యాంక్
  • 121 మార్కులతో శరత్‌చంద్ర (హైదరాబాద్)కు రెండో ర్యాంక్
తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్-2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 96.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షకు మొత్తం 32,106 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 30,944 మంది అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.

పరీక్షలో టాపర్ల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన గణపతిశాస్త్రి 126 మార్కులతో ప్రథమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కే చెందిన శరత్‌చంద్ర 121 మార్కులతో ద్వితీయ ర్యాంకు సాధించగా, వరంగల్‌కు చెందిన నాగరాజు తృతీయ ర్యాంకును దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Telangana EdCET
EdCET 2024
Balakishta Reddy
Kakatiya University
B.Ed Admissions

More Telugu News