Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట వద్ద హైవేపై ప్రమాదాల జోన్‌ను పరిశీలించిన మంత్రి ఆనం

- ఏఎస్ పేట వద్ద ప్రమాదాలపై మంత్రి ఆనం దృష్టి
- ఆత్మకూరు సమీపంలో ప్రమాదాల జోన్ పరిశీలించిన మంత్రి ఆనం
- ప్రమాదాల కట్టడికి పటిష్ట చర్యలు చేపడతామన్న మంత్రి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టి సారించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి ఈ ప్రమాదకర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కృష్ణపట్నం పోర్టు - ముంబై జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు రాష్ట్ర అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గతంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. 2024 జూన్ నాటికి ఏడాది కాలంలో 22 ప్రమాదాలు జరిగితే, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ ఏడాది జూన్ నాటికి ఆ సంఖ్య 10కి తగ్గిందని వివరించారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలో 2024లో 68 ప్రమాదాల్లో 37 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 27 ప్రమాదాల్లో 16 మంది మృతి చెందారని తెలిపారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు.