BR Naidu: ద్వీపదేశం బహ్రెయిన్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణోత్సవం.. వీడియో ఇదిగో

- బహ్రెయిన్ సల్మాబాద్ లోని గోల్డెన్ ఈగల్ హెల్త్ క్లబ్ లో శ్రీనివాస కల్యాణం
- ముఖ్య అతిధిగా హాజరైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- స్వామి కల్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రవాస భారతీయులు
ద్వీపదేశం బహ్రెయిన్‌లో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆ దేశానికి చెందిన శ్రీ వెంకటేశ్వర సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సల్మాబాద్‌లోని గోల్డెన్ ఈగల్ హెల్త్ క్లబ్‌లో టీటీడీ వేదపండితులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కల్యాణోత్సవాన్ని వీక్షించారు. బహ్రెయిన్‌లో జరిగిన శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా భక్తులు వీక్షించారు.