Gopinath: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచార యత్నం .. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

- చెన్నైలోని కుబేరన్ నగర్ లో ఘటన
- ఫిర్యాదు చేసిన పట్టించుకోని జెప్టో యాజమాన్యం
- సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు
- ఐటీ ఉద్యోగిని ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడానికి వచ్చిన ఓ ఈ-కామర్స్ డెలివరీ బాయ్, ఐటీ ఉద్యోగినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
మడిపాక్కంకు చెందిన ఓ మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్ ద్వారా కిరాణా సామాగ్రికి ఆర్డర్ చేయగా, గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. సెల్ ఫోన్ చార్జింగ్ లేదని చెప్పి, కాసేపు చార్జింగ్ పెట్టుకుంటానని అతను కోరడంతో, ఆమె అతన్ని లోపలికి అనుమతించింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన గోపీనాథ్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.
చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఈ ఘటనపై జెప్టో సంస్థకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు దీనిపై స్పందించలేదు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, నిందితుడు గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై జెప్టో యాజమాన్యం స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.