Kubera Movie: తొలిరోజే రూ.30 కోట్లు వసూలు చేసిన ‘కుబేర’

--
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాపై వచ్చిన పాజిటివ్ టాక్ విడుదల తర్వాత కూడా కొనసాగింది. దీంతో తొలిరోజు కుబేర సినిమాపై కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కుబేర మూవీ తొలిరోజు రూ.30 కోట్లు వసూలు చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో తమ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్నట్లు తెలిపింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టినట్లు వెల్లడించింది.