Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Vijay Deverakonda Faces Atrocity Case Over Remarks
  • రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో వ్యాఖ్యలపై ఫిర్యాదు
  • గిరిజనులను కించపరిచేలా మాట్లాడారని సంఘాల ఫైర్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నిర్వహించిన ‘రెట్రో’ ప్రీరిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. దీనిపై ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు చాలాచోట్ల ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు వారు వివరించారు.

తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి.
Vijay Deverakonda
Retro movie
Atrocity case
Tribal groups
Pahalgam terror attack
Controversial comments
SC ST Act
FIR
Tollywood
Pre release event

More Telugu News