Rohit Sharma: టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయాను: రోహిత్ శర్మ

Rohit Sharma Forgot Toss Decision in CLT20 Match
  • టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడి
  • 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 నాటి ఓ సంఘటనను గుర్తుచేసుకున్న వైనం
  • టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయిన రోహిత్
  • ఫీల్డింగ్ బదులు పొరపాటున బ్యాటింగ్ తీసుకున్న హిట్ మ్యాన్
  • కోచ్ కుంబ్లే ప్రశ్నించగా, పిచ్ బాగుందని చెప్పి కవర్ చేసిన వైనం
  • పొరపాటు జరిగినా ఆ మ్యాచ్‌లో విజయం సాధించామని వెల్లడి
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ తన కెరీర్‌లోని ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) సందర్భంగా తాను కెప్టెన్‌గా చేసిన ఓ పొరపాటును గుర్తుచేసుకున్నాడు. ఆ పొరపాటు వలన కాస్త కంగారుపడినా, చివరికి మ్యాచ్ గెలవడం విశేషం.

ఆ సంఘటన గురించి రోహిత్ శర్మ వివరిస్తూ, "ఒకసారి 2013 సీఎల్‌టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచాం. నిజానికి మేము ఫీల్డింగ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. అయితే, టాస్ గెలిచిన తర్వాత నేను బ్యాటింగ్ ఎంచుకున్నాను. అది చూసి కోచ్ అనిల్ భాయ్ (అనిల్ కుంబ్లే) నా దగ్గరకు వచ్చి, 'రోహిత్ ఏంటి ఇలా చేశావ్?' అని అడిగాడు. అప్పుడు నేను, 'పిచ్ బాగుందనిపించింది, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా' అని చెప్పాను. కానీ, వాస్తవానికి టాస్ వద్ద ఏం తీసుకోవాలో నేను మర్చిపోయాను. అందుకే పొరపాటున అలా చెప్పేశాను. ఏదేమైనా, ఆ మ్యాచ్‌లో మేం గెలిచాం" అని నవ్వుతూ చెప్పారు.

ఈ విషయాన్ని రోహిత్ శర్మ 'హూ ఈజ్ ది బాస్' యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా వెల్లడించాడు.
Rohit Sharma
CLT20
Champions League T20
Anil Kumble
Cricket
Indian Cricket
Mumbai Indians
Cricket Match
Toss Decision

More Telugu News