Shirdi Sai Baba: షిరిడీ వెళ్లే వారికి శుభవార్త... స్పెషల్ రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

Shirdi Sai Baba Devotees Get Good News Special Trains Announced
  • జులై 3 నుంచి 25 వరకు సికింద్రాబాద్ - నాగర్ సోల్ మధ్య స్పెషల్ రైళ్లు
  • ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన 
  • ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి, ప్రతి శుక్రవారం నాగర్ సోల్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో
షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ  స్పెషల్ రైళ్లు జులై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్ - నాగర్‌సోల్ స్పెషల్ రైలు (07007) జులై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది.

అలాగే నాగర్‌సోల్ - సికింద్రాబాద్ స్పెషల్ రైలు (07002) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు నాగర్‌సోల్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వెల్లడించింది.

ఈ రైలు రెండు మార్గాల్లో మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ రైలులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. 
Shirdi Sai Baba
Shirdi
South Central Railway
Special Trains
Secunderabad
Nagarsole
Indian Railways
Train Timings
Pilgrimage
Railway Announcement

More Telugu News